Tuesday, September 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆరేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి..

ఆరేళ్ల చిన్నారిపై పిచ్చికుక్క దాడి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఆరేళ్ల చిన్నారిపై కుక్క దాడికి పాల్పడిన సంఘటన, మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని దుబ్బతాండకు చెందిన ధరావత్ సికిందర్ యశోదల కూతురు సాయి కీర్తన, ఆరేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం, ఇంటి ముందు ఆరుబయట ఆడుకుంటుండగా అటుగా వెళుతున్న పిచ్చికుక్క సాయి కీర్తన చిన్నారిపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో చిన్నారి చెవి పూర్తిగా గాయపడి తీవ్రంగా రక్తస్రావం అయింది. తక్షణమే చిన్నారిని తొర్రూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. పరిస్థితి గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం చిన్నారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్లు తొర్రూర్ ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -