నవతెలంగాణ-హైదరాబాద్: రాజ్యసభకు చెందిన 59 మంది సభ్యుల పదవీ కాలం ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై మధ్య 20 రాష్ట్రాలకు చెందిన 59 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. దీంతో వారందరికి న్యూఢిల్లీలోని వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్‌లో ఘనం పేర్ వేల్ ఘనంగా నిర్వహించారు. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ విడుదల చేసింది.
పదవీ కాలం ముగిసిన వారిలో ప్రముఖులు మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ, డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, శరద్ పవార్, ఆర్‌పిఐ నాయకుడు రామ్‌దాస్ అథవాలే వంటి ప్రముఖులతో పాటు తొమ్మిది మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీరిలో శరద్ పవార్, రామ్‌దాస్ అథవాలే ఇద్దరూ ఇప్పటికే రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు.



