Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూతబడిన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్

మూతబడిన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న టీచర్

- Advertisement -

పట్టించుకోని ఎంఈఓ…పర్యవేక్షణ చేస్తామన్న డిఈఓ
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలం పెద్దతూండ్ల గ్రామపచాయితీ పరిదిలోగల నాయకపుపల్లి(కిషన్ రావుపల్లి)లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో విద్యార్థులు లేకపోవడంతో మూతపడింది. మూడేళ్ళుగా పాఠశాలలో ఒక్కరూ, ఇద్దరు విద్యార్థులతో నెట్టుకొస్తున్న నేపథ్యంలో 2025-26 విద్యా సంవత్సరంలో ఒక్కరంటే ఒక్క విద్యార్థి కూడా లేకపోవడంతో పాఠశాల మూతబడింది. పాఠశాలలో విద్యార్థులు లేకున్నా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విధులు మాత్రం నిర్వహిస్తోంది. ప్రభుత్వం నుంచి వేతనం పొందడానికి సమయపాలన లేకుండా చుట్టం చూపులా ఉదయం పాఠశాలకు వస్తూ తన చేరవాణితో టైంపాస్ చేస్తూ మధ్యాహ్నం ఇంటిబాట పడుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ తతంగంపై సెప్టెంబర్ 17న నవ తెలంగాణ దినపత్రికలో,మూతబడిన నాయకపుపల్లి పాఠశాల,అనే కథనం ప్రచురించిన నేపథ్యంలో మండల ఎంఈఓ లక్ష్మన్ బాబు వివరణ నవ తెలంగాణ కోరగా  దసరా తరువాత ఇక్కడ విధులు నిర్వహిస్తున్న టీచర్ ను డిప్టేషన్ పై వేరే పాఠశాలకు పంపిస్తామని చెప్పిన మండల విద్యాధికారి నేటికి పాఠశాల వైపు కన్నెత్తి చూడకపోగా పట్టించుకోకపోవడం గమనార్హం.

మందుబాబులకు అడ్డాగా..

పాఠశాలలో విద్యార్థులు లేక ఖాళీ కావడంతో ఇదే గ్రామంలో ఉన్న అంగన్ వాడి కేంద్రాన్నీ సిప్ట్ చేశారు.అంగన్ వాడికి సంబంధించిన సామగ్రి పాఠశాల భవనంలోకి సిప్ట్ చేశారు.పాఠశాల మాత్రం అపరిశుభ్రత,పాఠశాల చుట్టూ చెత్త,చెదారంతో నిండిపోయి కనిపిస్తోంది. రాత్రివేళల్లో పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారినట్లుగా ఖాళీ గ్లాసులు,మద్యంసీసాలు ఆనవాళ్లు కనిపించాయి.

త్వరలో పర్యవేక్షణ చేస్తాం: రాజేందర్…భూపాలపల్లి డిఈఓ
పాఠశాలలో విద్యార్థులు లేకున్నా టీచర్ విధులకు రావడంపై భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాజేందర్ ను నవతెలంగాణ వివరణ కోరగా నాయకపుపల్లి పాఠశాలలో విద్యార్థులు లేని విషయం తన దృష్టికి రాలేదని స్థానిక ఎంఈఓ ద్వారా పూర్తి వివరాలను తెలుసుకొని త్వరలో పాఠశాలను పర్యవేక్షణ చేస్తాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -