Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలికి  ఘన సన్మానం

పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయురాలికి  ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూరు
మండలంలోని అమీనాపూర్ గ్రామంలోని ఉచ్చతర ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్) గా పనిచేసిన కే. సరస్వతి  ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం పీఆర్టీయూ మండల శాఖ తరపున అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోడ దేవానందం, నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 42 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో వారు ఎంతో వృత్తి నిబద్ధతతో, ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి ఘనత వారికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పెంట జలంధర్, జిల్లా మాజీ అధ్యక్షులు తుమ్మల లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ.. 42 సంవత్సరాలుగా పిఆర్టియు సంఘ ప్రాథమిక సభ్యులుగా కొనసాగడం చాలా గొప్ప విషయం అని, సీనియర్ కార్యకర్త రిటైర్మెంట్ సంఘానికి తీరని లోటు అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు అంబుజా రాణి, విజయ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్, సురేష్ , మండల కార్యదర్శి అంజలి, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు రాఘవేందర తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -