Saturday, February 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండలంలోని ఆగ్రహంపాడు, రామచంద్రాపురం, చౌళ్ళపల్లి, అక్కంపేట, గ్రామాల్లో పంట పొలాల్లో శుక్రవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం  మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్‌గా వ్యవహరించిన సీనియర్ శాస్త్రవేత్త డా. ఏ. విజయ భాస్కర్ మాట్లాడుతూ.. యాసంగి మొక్కజొన్నలో కత్తెరపురుగు నివారణకు వేపనూనె (1500 ppm) 5 మి.లీ.ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. తీవ్రత ఎక్కువగా ఉంటే ఎకరానికి క్లోరాంట్రానిలిప్రోల్ గుళికలు 4 కేజీలు మొవ్వులో వేయాలి లేదా 60 మి.లీ. మందును పిచికారీ చేయాలని అన్నారు. ప్రస్తుతం మిర్చి పూత – కాయ దశలో ఉంది. రసం పీల్చే పురుగుకు ఎసిఫేట్ 1.5 గ్రా లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, వేపనూనె (1500 ppm) 5 మి.లీ తో ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. తామర పురుగుకు ఫిప్రోనిల్ 2 మి.లీ తో పాటు ఎకరానికి 20 నీలి లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. యాసంగిలో చలి ఉధృతికి వరిలో అగ్గితెగులు నివారణకు ఇసుప్రొతైలన్ రింగ్ 1.5 మి.లీ.ను ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని పేర్కొన్నారు. యాసంగి పంటలు తీసి ఫిబ్రవరి చివరిలో పెసర, నువ్వులు, కూరగాయల వంటి ఆరుతడి పంటలు వేయాలని రైతులకు సూచించారు. ఈ బృందంలో శాస్త్రవేత్త డా. విశ్వ తేజ పాటు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -