- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీ దారుణం జరిగింది. జైత్ పూర్ లో భారీ వర్షాలకు గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హరినగర్ లో జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులను షబీబుల్ (30), రబీబుల్ (30), రుబీనా (25), ముట్టు అలీ (45), డాలీ (25), రుక్సానా (6), హసీనా (7)లుగా గుర్తించారు. కాగా.. గోడ కూలడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పాత, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
- Advertisement -