Friday, September 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలుయాంకర్ స్వేచ్ఛ మృతిపై సమగ్ర విచారణ చేయాలి: సీపీఐ (ఎం)

యాంకర్ స్వేచ్ఛ మృతిపై సమగ్ర విచారణ చేయాలి: సీపీఐ (ఎం)

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ టివి యాంకర్, సభ్యువాది, రచయిత్రి, మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ మరణం పట్ల సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిది. ఈ రోజు ఆమె నివాసం వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు డిజి నర్సింహారావు, టి, స్కైలాబ్ బాబు, జె. బాబూరావు, కోట రమేష్ లతో కూడిన ప్రతినిధి బృందం అమె మృతదేహానికి నివాళులర్పించింది. ఆమె అనుమానాస్పదంగా మృతి చెందినట్లు తెలుస్తున్నది. కుటుంబ సమస్యలు కూడా వున్నట్లు తెలుస్తోంది. అనేక ఉద్యమాల్లో పాల్గొన్న స్వేచ్ఛ పిరికితనంతో ఆత్మహత్య చేసుకునే అవకాశం లేనట్లు కనపడుతుంది. ఆ నేపథ్యంలో ఆమె మరణంపట్ల అనేక ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఈ మరణంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని అందుకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ (ఎం) డిమాండ్ చేస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -