Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంధర్మస్థల ఘటనపైసమగ్ర దర్యాప్తు జరపాలి : ఐద్వా

ధర్మస్థల ఘటనపైసమగ్ర దర్యాప్తు జరపాలి : ఐద్వా

- Advertisement -

నవతెలంగాణ – బ్యూరో-హైదరాబాద్‌
ధర్మస్థల ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి విలేకర్లతో మాట్లాడారు. కేసును వెలుగులోకి తెచ్చిన విజిల్‌ బ్లోయర్‌, వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ధర్మస్థలంలో 1995 నుంచి వందలాదిమందిని చంపినట్టుగా నాడు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన విజిల్‌ బ్లోయర్‌ మే 21న పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. నాటినుండి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్నదనీ, దీనిపై జర్నలిస్టులు చేసిన వీడియోలను డిలీట్‌ చేశారని పేర్కొన్నారు. బ్లోయర్‌ చెప్పిన సమాచారం మేరకు నిజనిర్ధారణలు జరిపి ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సమగ్ర పరిశీలన చేసి వాస్తవాలను వెలికితీయాలనీ, అందుకు సంబంధించిన దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాలికలు, యువతులపై లైంగిక వేధింపులు, హత్యలు, ఖననాలు జరిగాయని బ్లోయర్‌ చెబుతున్నాడని గుర్తు చేశారు. గతంలో నమోదైన మిస్సింగ్‌ కేసులను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయకముందే మృతదేహాలను బయటకు తీయాలనీ, దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. న్యాయవాదులకు భద్రత కల్పించాలనీ, తప్పిపోయిన బాలికలు మహిళల తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సంరక్షకులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, సీనియర్‌ నాయకురాలు కెఎన్‌ ఆశాలత పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img