- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతోన్నవేళ ఈ కేసు కీలక మలుపు తిరిగింది. సింగపూర్‌లో యాట్ పార్టీలో జరిగిన ఘటనలో ఆయన కజిన్, పోలీసు అధికారి సందీపన్ గార్గ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. ప్రమాద సమయంలో జుబీన్‌తో అతడే ఉన్నాడు. ఇప్పటివరకు ఐదుగురు అరెస్టయ్యారు. వారిలో జుబీన్ బ్యాండ్‌మేట్ శేఖర్ గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంత, మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఫెస్టివల్ మేనేజర్ శ్యాంకను ఉన్నారు.
- Advertisement -