నిమిష ప్రియ వ్యవహారంపై విదేశాంగశాఖ వ్యాఖ్య
న్యూఢిల్లీ : యెమెన్‌లో కేరళ నర్సు నిమిష ప్రియకు ఉరిశిక్ష వ్యవహారం చాలా సున్నితమైన విషయమని కేంద్ర విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసు పరిష్కారం కోసం అన్ని సహాయాలను అందిస్తున్నామని తెలిపింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. యెమెన్‌లోని స్థానిక అధికారులతో స్నేపూర్వక సంప్రదింపులు జరుపుతున్నామని, నిమిష ప్రియ కుటుంబానికి సహాయం చేయడానికి ఒక న్యాయవాదిని నియమించామన్నారు. నిమిష ప్రియ కుటుంబం, బాధిత కుటుంబ మధ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం సమిష్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కేరళలోని పాలక్కడ్‌కు చెందిన 38 ఏళ్ల నిమిష ప్రియ యెమెన్‌లో ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో ఆమెకు స్థానిక కోర్టు ఆమెకు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 16న అమలు కావాల్సిన ఉరిశిక్ష ప్రస్తుతానికి వాయిదా పడింది. హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి పరిహారంగా కొంత మొత్తం అందజేసేందుకు నిమిష ప్రియ బంధువులు సంసిద్ధత వ్యక్తం చేశారు. క్షమానిధి (బ్లడ్ మనీ)గా పరిగణించే ఈ మొత్తాన్ని స్వీకరించేందుకు వారు అంగీకరిస్తే నిమిష ప్రియకు ఉరిశిక్ష నుంచి క్షమాభిక్ష లభించేవీలుంది. కానీ హత్యకు గురైన వ్యక్తి సోదరుడు బ్లడ్ మనీకి తాము అంగీకరించే ప్రసక్తే లేదని, ఆమెకు ఉరిశిక్ష పడాల్సిందేనని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో నిమిష ప్రియ పరిస్థితి మళ్లీ కష్టాల్లో పడినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ జోక్యం కీలకంగా మారింది.
చాలా సున్నితమైన విషయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES