Thursday, May 15, 2025
Homeతాజా వార్తలువ్యోమికా, సోఫియా కురేషీల‌పై దేశ‌భ‌క్తి చాటుకున్న ఓ యువ‌కుడు

వ్యోమికా, సోఫియా కురేషీల‌పై దేశ‌భ‌క్తి చాటుకున్న ఓ యువ‌కుడు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: ప‌హ‌ల్గాం దాడికి ప్ర‌తీకారంగా ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో పాక్‌పై భార‌త్ వాయుసేన‌లు విరుచుక‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఆపరేషన్ సింధూర్ లో క‌ల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు కీల‌క పాత్ర షోషించారు. దేశ‌వ్యాప్తంగా ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. తాజాగా వారిపై ఓ యువ‌కుడు త‌న దేశ‌భ‌క్తిని చాటుకున్నాడు.మహీంద్రా థార్‌ నలుపు రంగు కారుకు ఆపరేషన్ సింధూర్ స్టిక్కరింగ్ చేయించారు. ముందు భాగంలో పేరు.. రెండు డోర్లకు ఓవైపు కల్నల్ సోఫియా కురేషీ , మరోవైపు వ్యోమికా సింగ్ అధికారుల ఫోటోలు ఉన్నాయి. అదేవిధంగా ఫైటర్ జెట్స్, ఆర్మీ జవాన్ల ఫోటోలు సైతం కారుకు స్టిక్కరింగ్ చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

https://www.facebook.com/reel/1923255641769867

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -