- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ రోడ్డు ప్రమాదంలో ఓ యువ క్రీడాకారిణీ మృతి చెందింది. అలప్పుజకు చెందిన యంగ్ అథ్లెట్ లక్ష్మీ లాల్..రోజు వారిలాగానే..ట్రైనింగ్ కోసం దగ్గరలో ఉన్నా మరారికులం సౌత్‌లోని పృథికులంకర స్టేడియంకు స్కూటర్ పై వెళ్తుండగా..అలప్పుజ-చేర్తల నేషనల్ హైవేపై ఒక్కసారిగా భారీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందగా తొటి క్రీడాకారిణి వినిత్ తీవ్ర గాయాలు కాగా..ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మణి లాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేప్టటారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను అధికారులు అరెస్ట్ చేశారు.
- Advertisement -