Sunday, October 5, 2025
E-PAPER
Homeజాతీయంఎంపి అభ్యర్థిగా రాజీందర్‌ గుప్తాను ప్రకటించిన ఆప్‌

ఎంపి అభ్యర్థిగా రాజీందర్‌ గుప్తాను ప్రకటించిన ఆప్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :  పంజాబ్‌ రాజ్యసభ స్థానానికి తమ అభ్యర్థిగా  ప్రముఖ పారిశ్రామిక వేత్త రాజిందర్‌ గుప్తాను ఎంపిక చేసినట్లు ఆప్‌ ప్రకటించింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజీవ్‌ అరోరా రాజీనామా చేయడంతో రాజ్యసభ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ పదవిని భర్తీ చేసేందుకు అక్టోబర్‌ 24న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్‌ తెలిపింది. ఎంపి పదవి కోసం రాజిందర్‌ గుప్తాను నామినేట్‌ చేయాలని రాజకీయ వ్యవహారాల కమిటీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.  ట్రైడెంట్‌ గ్రూప్‌ ఎమెరిటస్‌ చైర్మన్‌ అయిన రాజిందర్‌ గుప్తా ఇటీవల రాష్ట్రఆర్థిక విధానం మరియు ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్ష పదవికి మరియు కాళీదేవి ఆలయ సలహా కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -