నవతెలంగాణ-హైదరాబాద్: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వారి ఆందోళనలను ఉధృతం చేశారు. ఫ్లకార్డులు చేతబూని అసెంబ్లీ ఎదుట ర్యాలీ నిర్వహించారు. కీలకమైన విషయాలపై సభలో చర్చ పెట్టకుండా..సమావేశాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆప్ ఎమ్మెల్యేలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, నీరు, గాలి కలుషితమైయ్యాయని తెలిపారు. అనేక సమస్యలు ఢిల్లీలో తిష్ట వేశాయని, కానీ వాటిపై చర్చ పెట్టకుండా అనవసర విషయాలపై బీజేపీ ప్రభుత్వం సభలో మాట్లాడుతుందని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తప్పుడు ట్రాన్స్‌క్రిప్షన్‌తో ఒక మోసపూరిత వీడియోను రూపొందించారు, ఆయనపై ఆ వీడియోను షేర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆప్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా నిరసనలు చేపట్టారు. ఆప్ మాజీ సీఎం అశితీష్ వీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.





