నవతెలంగాణ-హైదరాబాద్: ఆప్ ఎంపీ రాఘవ చందు..ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పేదల ప్రజల కష్టాలపై, అలాగే బ్యాంక్‌ల్లో కనీస నగదు నిల్వలు, 28 రోజులకే నెలను లెక్కిస్తున్నా టెలికాం సర్వీస్‌ల దోపీడి విధానాలపై గళమెత్తారు. తాజాగా ఆప్ ఎంపీ రాఘవ చందు మరోసారి కీలక అంశాన్ని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా లెవనెత్తారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపు అతివలది..పెత్తనం భర్తలదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఉద్దేశించిన విధంగా స్థానిక సంస్థలలో మహిళా ప్రతినిధులు నిజమైన అధికారాన్ని చెలాయించగలరు. చాలా చోట్ల మహిళల కోసం రిజర్వ్ చేయబడిన పంచాయతీ సీటుకు ఒక పురుష రాజకీయ నాయకుడి భార్య, కుమార్తె, సోదరి లేదా కోడలు పోటీ చేస్తుంటారు, అయితే అసలైన అధికారం మాత్రం ఆమె చేతిలో కాకుండా అతని చేతిలోనే కొనసాగుతుందని మండిపడ్డారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ రాజ్ సంస్థలలో మహిళలకు 33% రిజర్వేషన్‌ను కల్పించారు కానీ వాస్తవికంగా వారు అధికారం చెలాయించడానికి దోహదం చేయడంలేదని వాపోయారు.
‘గత వారం పార్లమెంటులో ఒక అనుబంధ ప్రశ్న ద్వారా ఈ విషయాన్ని లేవనెత్తాను. ఈ పద్ధతి ఉందని ప్రభుత్వం అంగీకరిస్తుందా? పంచాయతీలకు ఎన్నికైన మహిళలు కేవలం నామమాత్రంగా సీటులో ఉండకుండా, నిజమైన అధికారాన్ని చెలాయించేలా చూసేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని? ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.



