Monday, February 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలునాని 'ది ప్యారడైజ్' నుంచి 'ఆయా షేర్' ప్రోమో వచ్చేసింది!

నాని ‘ది ప్యారడైజ్’ నుంచి ‘ఆయా షేర్’ ప్రోమో వచ్చేసింది!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఆయా షేర్’ అనే పాట ప్రోమోను చిత్రబృందం ఇవాళ‌ విడుదల చేసింది. ఈ ప్రోమోలో నాని రెండు జడల గెటప్‌లో మాస్ స్టెప్పులతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

అనిరుధ్ రవిచందర్ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ కుమార్ సాహిత్యం అందించారు. అద్దుల జంగిరెడ్డి, అకునూరి దేవయ్య, అనిరుధ్ కలిసి ఆలపించారు. పూర్తి పాటను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -