- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ‘కలాం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌లో ప్రఖ్యాత నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఆదిపురుష్’ చిత్రంతో వార్తల్లో నిలిచిన ఓం రౌత్ ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ వార్త యావత్ భారతీయ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర కూడా ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటుండడంతో తెలుగువారిలోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.
- Advertisement -