Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి : రేవంత్ రెడ్డి

అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివి : రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : క్షిపణి శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు మరువలేనివని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్‌ కలాం వర్ధంతి సందర్భంగా ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్నారు. ‘మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు. విజ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శకునిగా నిలిచిన కలాం తన జీవితం మొత్తాన్ని దేశసేవకు అంకితం చేసిన మహాత్ముడని ఆయన గుర్తుచేసుకున్నారు. కలాం ఆశయాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరు వారి విలువలు, ఆలోచనలను అనుసరిస్తూ స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad