- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (68) ఒంటరి పోరాటం చేయడంతో ఆసీస్ ఎదుట 126 పరుగుల మోస్తరు టార్గెట్‌ను ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటయ్యింది. హర్షిత్ రాణా (35) మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. గిల్ (5), శాంసన్ (2) సూర్య (1), అక్షర్ పటేల్ (7) పూర్తిగా నిరాశపరిచారు. తిలక్ వర్మ, కుల్‌దీప్ డకౌట్‌గా వెనుదిరిగారు.
- Advertisement -

 
                                    