Thursday, September 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు..భారీగా పట్టుబడుతున్న నగలు

తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు..భారీగా పట్టుబడుతున్న నగలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హనుమకొండ జిల్లా ఖాజీపేట చైతన్య పురిలో ఖిలా వరంగల్ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో నాగేశ్వర్ రావుకు చెందిన నివాసంతో పాటు ఖమ్మం, హైదరాబాద్,కరీంనగర్, ఆదిలాబాద్ తో పాటుగా మొత్తం ఎనిమిది చోట్ల ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిది ఏసీబీ బృందాలు ఉదయం నుంచి సోదాలు చేపట్టారు.

కాజీపేటలోని ఆయన ఇంట్లో ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, కొంత నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నాగేశ్వరరావు అక్రమ ఆస్తుల ఆరోపణలపై ఏక కాలంలో ఎనిమిది చోట్ల ఏసీబీ రైడ్స్‌ చేపట్టడంతో రెవెన్యూశాఖలో కలకలం రేపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -