– శుభాకాంక్షలు తెలిపిన పాలకవర్గం, ఉద్యోగులు
నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) నూతన ఎండిగా బిక్షపతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ విభాగంలో వరంగల్ రూరల్ డిఈగా 17 ఏళ్ల పాటు పనిచేసి, ఇటీవలే ఎస్ఈ ఆయన పదోన్నతి పొంది, డిప్యూటేషన్ పై సిరిసిల్ల సెస్ ఎండిగా నియమితులయ్యారు. కాగా ఇప్పటివరకు ఇంచార్జీ ఎండిగా కొనసాగిన రామ్ సుబ్బారెడ్డి నుండి సోమవారం ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే బిక్షపతి సెస్ ఎండిగా ఏడాది పాటు కొనసాగనున్నట్లు ఎన్పీడీసీఎల్ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా ఆయన ఉద్యోగకాలం మరో నాలుగేళ్లలో ముగియనుంది. నూతన ఎండిగా బాధ్యతలు చేపట్టిన బిక్షపతికి సెస్ చైర్మెన్ చిక్కాల రామారావుతో పాటు పాలకవర్గం, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
సెస్ ఎండిగా బిక్షపతి బాధ్యతల స్వీకరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES