నవతెలంగాణ – హైదరాబాద్ : అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం జరిగింది. మూడు బస్సులు ఒకదానినొకటి ఢీకొట్టుకోవడంతో 10మందికిపైగా యాత్రికులకు గాయాలైన ఘటన ఆదివారం కుల్గాం జిల్లాలో జరిగింది. కుల్గాం జిల్లాలోని ఖుద్వానీ ప్రాంతంలోని టాచ్లూ క్రాసింగ్ సమీపంలో యాత్రా కాన్వాయ్ లోని మూడు బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో పది మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికులు గాయపడ్డారు. గాయపడినవారందరినీ వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక వైద్య సహాయం అందించి, తదుపరి చికిత్స కోసం అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల (జీఎంసీ)కు తరలించారు. ఈ ఘటన వల్ల అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలికంగా అంతరాయం కలిగించినప్పటికీ, యాత్ర కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. స్థానిక అధికారులు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు.
అమర్ నాథ్ యాత్రలో ప్రమాదం.. 10మంది
- Advertisement -
- Advertisement -