నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
వైద్య శిబిరంలోఎస్పి మహేష్ బిగితేనవ తెలంగాణ రాజన్న సిరిసిల్లగత ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలో 370 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఈ ప్రమాదాల్లో 80 శాతం మంది చనిపోయారని, డ్రైవర్లకు దృష్టిలోపం ఉండడంతోనే ఈ ప్రమాదాలు జరిగాయని నిర్ధారణ జరిగినట్లు ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు.సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో రాజన్న సిరిసిల్ల పోలీస్ ల ఆధ్వర్యంలో వాహనాల డ్రైవర్లకు శనివారం జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్పి మహేష్ బిగితే పాల్గొని మాట్లాడుతూ రెండు సెకండ్లలో ప్రమాదం గుర్తించినట్లయితే డ్రైవర్లు ప్రమాదం నుంచి బయట పడవచ్చని దృష్టిలోపం ఉండటంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని దీంట్లో భాగంగానే డ్రైవర్లకు కంటి పరీక్షలు పోలీస్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఆరు మాసాలకు ఒకసారి తప్పనిసరి కంటి పరీక్షలు చేయించుకోవాలని, వాహనాలు నడిపే డ్రైవర్లు బాధ్యతగా ఉండాలని అనేకమంది వాహనాల్లో ప్రయాణిస్తుంటారని వారికి ఎలాంటి ప్రమాదం జరగవద్దంటే డ్రైవర్ల కండ్లు బాగుండాలని ఆయన అన్నారు జనవరి మాసం నుంచి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఉచితంగా కళ్లద్దాలు ఇప్పిస్తామని ఎస్పీ అన్నారు. కంటి వైద్య శిబిరాలను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎస్పి కత్రోజు నాగేంద్ర చారి, సీఐ కృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, వినీత రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
రైవర్లకు దృష్టిలోపంతోనే ప్రమాదాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



