- Advertisement -
– అధికారులు ముమ్మరి ఏర్పాట్లు
– నాలుగు గ్రామాల ప్రజలకు వసతులు
నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వరద బాధితులకు వసతులు కల్పించారు. ముమ్మర జనాలతో బాలుర పాఠశాల సందడిగా కనిపిస్తోంది. మద్నూర్ డోంగ్లి మండలాల పరిధిలోని నాలుగు గ్రామాలైన తడి ఇప్పర్గా, చిన్న టాక్లి, పెద్ద టాక్లి, సిరిపూర్, 200 పైన వరద బాధితులు పాఠశాలలో వసతులు పొందుతున్నారు. ఈ గ్రామాలు ఇటు లేండి వాగు అటు మంజీరా నది పరిసర గ్రామాలు వరదనీటి మూలంగా ముంపుకు గురైన గ్రామాల బాధ్యతులను తరలించి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో వసతులు కల్పించారు. వారికి కావలసిన ఏర్పాట్లు మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ ఎంపీడీవో రాణి పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి.
- Advertisement -