విజయ్ సేతుపతికి అటు తమిళంలోను, ఇటు తెలుగులోనూ ఓ ప్రత్యేక అభిమానగణం ఉంది. ఆయన చిత్రాలపై అందరిలోనూ అమితాసక్తి ఉంటుంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అందులో మంచి కాన్సెప్ట్, ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని అందరూ ఫిక్స్ అవుతారు. తాజాగా ఆయన హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా అరుముగ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘ఏస్’. 7సిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మితమైన ఈ మూవీ తెలుగు హక్కుల్ని శ్రీ పద్మిని సినిమాస్ దక్కించుకుంది. పద్మ సమర్పణలో బి.శివప్రసాద్ ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబో తున్నారు. ఈ సినిమా కోసం ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలు పోటీ పడినా కూడా మంచి ఫ్యాన్సీ రేటుకి శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ చేజిక్కించుకుంది. బి.శివప్రసాద్ దర్శక, నిర్మాణంలో గతంలో ‘రా రాజా’ అనే సినిమా రిలీజై, మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘ఏస్’ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో ఈనెల 23న రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సంగీతం : జస్టిన్ ప్రభాకరన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సామ్ సీఎస్.