నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మురళి ఏప్రిల్ 30న జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఏసీపీ రాహుల్ రెడ్డి నేడు పరామర్శించారు. భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కాన్వాయ్ కోసం గంజ్ ప్రాంతంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా, ఓ కార్ ను అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్, మురళి కాలి మీదుగా వెళ్లింది. దీంతో తీవ్రంగా ఆయన గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం సహచరులు వెంటనే స్పందించి మురళిని సమీప ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించారు. ప్రస్తుతానికి మురళి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, భువనగిరి డివిజన్ ఏసీపీ కె రాహుల్ రెడ్డి, భువనగిరి పట్టణ ఎస్ హెచ్ఓ కె సురేష్ కుమార్, మురళి ఇంటికి వెళ్లి పరామర్శించారు. గాయపడిన కానిస్టేబుల్‌కు ధైర్యం చెప్పి, త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో పోలీస్ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం ఎదురైనా, శాఖ వారి పట్ల పూర్తి మద్దతుగా నిలుస్తుందన్న సందేశాన్ని వారు ఇచ్చారు.
కానిస్టేబుల్‌ను పరామర్శించిన ఏసీపీ..
- Advertisement -
RELATED ARTICLES