– ఎస్‌ఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఫీజులు కట్టలేదని ఇంటర్ హాల్‌టికెట్లు నిలుపుదల చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజినీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం అవుతున్న నేపధ్యంలో ప్రయివేట్, కార్పోరేట్ జూనియర్ కళాశాలలు ఫీజులు కట్టలేదని పేరుతో హాల్ టికెట్స్ నిలుపుదల చేయడం విద్యార్థుల హక్కులను హరించడమేనని వారు విమర్శించారు. హాల్‌టికెట్స్ ఇవ్వకుండా వేధిస్తున్న కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థులకు రాజ్యాంగం చదువుకునే హక్కును కల్పించిందనీ వేధించడం సరైనది కాదనీ, హాల్‌టికెట్స్ ఇంటర్నెట్, వాట్సాప్‌లో ఇస్తున్నామని చెబుతున్న ఇంటర్ కళాశాలలు ఫీజులు కోసం వేధిస్తూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలనీ, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఎఫ్‌ఐ ఉద్యమిస్తుందని వారు హెచ్చరించారు.
హాల్‌టికెట్లు నిలిపేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



