Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గురుకులాల సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలి.

గురుకులాల సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలి.

- Advertisement -

 నవతెలంగాణభువనగిరి
 ఎస్సీ గురుకులాల విద్యార్థుల మనోభావాలను అగౌరపరిచేలా మాట్లాడిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణీ పై కఠిన చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గురుకులాల్లో చదివే విద్యార్థులు టాయ్ లేట్లు కడగడం, రూమ్ లు శుబ్రం చేసుకుంటే తప్పేంటి అని, గురుకులాల పిల్లలు పోష్ సొసైటీ నుంచి వచ్చారా అని అనడం బాలల హక్కులను భంగం కలిగించడమే అని ఆయన అన్నారు. లక్షలాది రూపాయల వేతనాలు తీసుకునే అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి ఆఫీస్ లోని టాయ్ లెట్ లు వారే శుబ్రం చేసుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాల్సిన అధికారులు, బాల కార్మిక వ్యవస్థను  పెంచి పోషించే విధంగా వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపనీయమని ఆయన అన్నారు. బడుగు బలహీన వర్గాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన పిల్లలను కించపరిచేలా మాట్లాడిన ఎస్సీ గురుకులాల సెక్రటరీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. విద్యా శాఖను స్వయంగా చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి, ఎస్సీ గురుకులాల సెక్రటరీ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad