నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని దక్షిణ కాశి శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు సందర్భంగా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగి డబ్బులు దొంగలించిన విషయం తెలిసిందే. మండల బిజెపి నాయకులు గురువారం ఆలయ ఈవో శ్రీధర్ లేనందున సిబ్బందికి హుండి డబ్బులు దొంగలించిన వ్యక్తిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -