- Advertisement -
- – బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేదించాలి
నవతెలంగాణ – హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటిలు,ఇన్ఫ్లియేన్సర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) హైద్రాబాద్ జిల్లా స్థాయి శిక్షణ తరగతులు గోల్కొండ చౌరస్తా లో సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ తరుగుతులను ప్రారంభించిన డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో యువత బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అందులో డబ్బులు పొగొట్టుకొని అప్పులు చేసి మానసికంగా కుంగిపోయి అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. - ఆన్లైన్ బెట్టింగ్స్ లో మొదట లాభాలను చూయించి తర్వాత మొత్తం డబ్బులను కాజేస్తున్నాయని దీంతో అప్పులు చేసి మరి ఆన్లైన్ లో బెట్టింగ్స్ పెట్టి మోసపోతున్నారని ప్రాణాలను బలి తీసుకుంటున్నారని అన్నారు.కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బెట్టింగ్ యాప్స్ లో డబ్బుల కోసం దూరాలవాట్లకు పాల్పడి కన్నా తల్లితండ్రుపైనే దాడులు చేస్తున్నారని ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేందించాలన్నారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిలో ఎంతటివారున్నా వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ శిక్షణ తరగుతుల్లో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, రాజయ్య, రవి, పావని, భానుకిరణ్ నాయకులు శ్రీను,కార్తీక్,జావీద్ సతీష్,జగదీష్, విజయలక్ష్మి, నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -