Monday, May 19, 2025
Homeతెలంగాణ రౌండప్రోడ్డు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి…

రోడ్డు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి…

- Advertisement -
  • – నవరోడ్డు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి…
    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
  • భువనగిరి పట్టణంలోని మీనా నగర్ లో 3-4-164 ఇంటి ముందు ఉన్న 20 ఫీట్ల రోడ్డును ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అదే వార్డుకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కబ్జా విషయంపై మున్సిపల్ కమిషనర్ కు టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన వాళ్లు వారిపై చర్యలు తీసుకోకుండా, మమ్మల్ని వారితో రాజీ కుదుర్చుకోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మార్చి 10, 20 25 రోజున భువనగిరి మున్సిపల్ కమిషనర్ కు, మే ఒకటవ తేదీన జిల్లా కలెక్టర్కు ఇన్వార్డులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంటనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకొని కబ్జాను నిరోధించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
  • భువనగిరి పట్టణంలోని మీనా నగర్ లో  3-4-164 ఇంటి ముందు ఉన్న 20 ఫీట్ల రోడ్డును ఆక్రమించుకొని అక్రమ నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని అదే వార్డుకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కబ్జా విషయంపై మున్సిపల్ కమిషనర్ కు టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు చేసిన వాళ్లు వారిపై చర్యలు తీసుకోకుండా, మమ్మల్ని వారితో రాజీ కుదుర్చుకోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మార్చి  10, 2025 రోజున భువనగిరి మున్సిపల్ కమిషనర్ కు, మే ఒకటవ తేదీన జిల్లా కలెక్టర్కు ఇన్వార్డులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంటనే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకొని కబ్జాను నిరోధించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.
  •  ప్రజావాణిలో 68 ఫిర్యాదులు..

 ప్రజావాణిలో 68 ఫిర్యాదులు వచ్చినట్లు  జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -