నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కోర్టు వినూత్న తీర్పు వెలువరించింది. బాలికపై మారు తండ్రి లైంగికంగా దాడికి యత్నించాడు. కేసు విచారణ సందర్భంగా పోక్సో యాక్ట్ కింద నిందితుడికి డబుల్ కాలం జీవిత ఖైదు శిక్ష విధించింది కోర్టు.
బాధితురాలు కేసు వాదించిన పీపీ అభిజిత్ సింగ్ రాథోడో మాటల ప్రకారం..సదురు బాలిక సొంత తండ్రి ఆరోగ్య కారణాలతో చనిపోయాడు. ఆ తర్వాత వెంటనే వేరే వ్యక్తితో ఆమె తల్లి వివాహం చేసుకుంది. ఈక్రమంలోనే బాలికపై కన్నెసిన మారు తండ్రి ఆమెపై పలుమార్ల లైంగికంగా దాడి చేసి, ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. సదురు బాలికపై ఏడాది పాటు మారు తండ్రి లైంగిక వేధింపులకు గురైందని చెప్పారు. విషయం తల్లికి తెలియడంతో..పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో నేరం నిరూపణ కావడంతో పోక్సో యాక్ట్ కింద నిందితుడికి డబుల్ కాలం జీవిత ఖైదీ శిక్షతోపాటు రూ.20వేల జరిమానా, బాధితురాలికి నష్టపరిహారం కింద రూ.3లక్షలు చెల్లించాలని ఇండోర్ ప్రత్యేక తీర్పు వెలువరించింది.



