- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నటుడు, బాడీబిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్(42) గుండెపోటుతో మరణించారు. పంజాబ్‌కు చెందిన ఆయన 2009లో మిస్టర్ ఇండియా కాంపిటీషన్ గెలిచారు. మిస్టర్ ఏషియా పోటీల్లో రెండో స్థానం సాధించారు. 2012లో ‘కబడ్డీ వన్స్ అగైన్’ అనే పంజాబీ మూవీలో హీరోగా, ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్బన్స్’, ‘మర్జావాన్’, సల్మాన్ ‘టైగర్-3’ మూవీలో నటించారు. నిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటుతో మృతిచెందారు.
- Advertisement -