- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గువాహటిలో భార్య రూపాలీతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. స్థానికులు వెంటనే ఆశిష్ దంపతులను హాస్పిటల్‌కు తరలించారు. తనకు స్వల్ప గాయాలైనట్లు ఆయన సోషల్ మీడియాలో ద్వారా వెల్లడించారు. తన భార్యను ఇంకా పరిశీలనలో ఉంచారని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందవద్దన్నారు. ఆశిష్ విద్యార్థి తెలుగులో పోకిరి, చిరుత సహా అనేక సినిమాలు చేశారు.
- Advertisement -



