Thursday, May 1, 2025
Homeతాజా వార్తలుఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి బాలకృష్ణ

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి బాలకృష్ణ

నవతెలంగాణ-సిటీబ్యూరో : సినీ నటుడు నందమూరి బాలకృష్ణ బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. తన వ్యక్తిగత నూతన వాహనం బీఎండబ్ల్యూ ఐ7 రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆయనకు ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం హీరో బాలకృష్ణ కొత్త వాహనం సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను సంబంధిత అధికారులు దగ్గరుండి నిబంధనలకు మేరకు పూర్తి చేశారు. కాగా ఇటీవల జరిగిన ఫ్యాన్సీ నంబర్ల ఆన్లైన్ ఈ-వేలంలో ఆయన రూ.7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్ 0001ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img