- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందుతున్న విషయం విదితమే. ఈ సినిమాకు సంబంధించిన మొదటి ఈవెంట్ ను నవంబర్ 15 వ తేదీన రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి మహేష్ బాబు ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈవెంట్‌కు పాస్‌లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు. పోలీసులకు సహకరించాలని కోరారు. పాస్‌పోర్ట్‌లు లేకుండా కంగారు పడి వచ్చేయకండి అంటూ వీడియోలో మహేష్ బాబు తెలిపారు.
- Advertisement -



