నవతెలంగాణ-హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో నేడు టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు నటుడు ప్రకాష్ రాజ్‌ను విచారించారు. మళ్లీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఈ రోజు విజయ్ దేవరకొండ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించి 29 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, దివి.. తదితరులపై సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది.