- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటీ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది ధర్మాసనం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డికి ఆదేశించింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ కొట్టివేసింది ధర్మాసనం.
- Advertisement -



