నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ మహిళా పోలీసుల తొలి సదస్సు నిర్వహిస్తున్నందుకు పోలీసులందరికీ అభినందనలు అని మంత్రి సీతక్క అన్నారు. మహిళా పోలీసుల సంక్షమo పట్ల ఒక కమిట్మెంట్‌గా ఈ సదస్సు నిలుస్తుందని ఆమె కొనియాడారు.మహిళా శక్తినీ ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నారని, ఈ సదస్సులో ఇచ్చే సలహాలు సూచనలకు అనుగుణంగా మహిళ పోలీసుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటారని మంత్రి భరోసా ఇచ్చారు.
రాజేంద్రనగర్ లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో తెలంగాణ మహిళా పోలీస్ తొలి సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరై..మహిళా పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి తెలంగాణ మహిళా పోలీస్ సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు.
1973లో కేరళ రాష్ట్రం కోజికోడ్లో తొలి మహిళా పోలీస్ స్టేషన్‌ను ఇందిరా గాంధీ ప్రారంభించారని గుర్తు చేశారు.ఆ తర్వాత దేశవ్యాప్తంగా మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారన్నారు. మహిళా పోలీసుల కృషితో ధైర్యంగా బాధిత మహిళలు న్యాయం పొందగలుగుతున్నారని కొనియాడారు.
వృత్తి ధర్మానికి మానవీయతను జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి సీతక్క సూచించారు. కమిట్మెంట్ కు కాన్ఫిడెన్స్ కు చిరునామా మహిళా పోలీసులన్నారు. వృత్తి ధర్మం, మాతృత్వం మధ్య మహిళా పోలీసులు సంఘర్షణలు ఎదుర్కొంటురని. మెటర్నిటీ లో ఉన్న మహిళా పోలీసులకు కొన్ని మినహాయింపులు ఉండాలని ఆమె సూచించారు.
బొగ్గుబాయిల నుంచి అంతరిక్షం వరకు మహిళా మణులు రాణిస్తున్నారు తెలిపారు. మహిళలకు కొన్ని ప్రత్యేక అవసరాలు ఉంటాయని..ఆయా పరిస్థితుల్లో పోలీస్ శాఖ మహిళ పోలీసులకు అండగా ఉండాలని పేర్కన్నారు. డ్యూటీలో సీనియర్ల మహిళ ఆఫీసర్లు జూనియర్ అధికారులకు మార్గదర్శకం చేయాలని సూచించారు.
