నవతెలంగాణ-హైదరాబాద్: రష్యా చమురు కొనుగోలు చేస్తుందంటూ భారత్ పై ట్రంప్ అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. యూఎస్ నిర్ణయాన్ని పలుదేశాలు ఖండించాయి. కక్షపూరితంగా భారత్ పై అదనపు సుంకాలు విధించడం సరైన పద్ధతి కాదని రష్యా ఖండించింది. తాజాగా భారతదేశంపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని అమెరికా అగ్ర ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇది తెలివి తక్కువ పనిగా అభివర్ణించారు. అమెరికా విదేశాంగ విధానంలో అత్యంత తెలివి తక్కువ చర్యగా పేర్కొన్నారు.భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడం ఏ మాత్రం భావ్యం కాదన్నారు. ట్రంప్ పారిపాలన చర్యను ఖండించారు.
భారతదేశంపై తొలుత ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. దీంతో ఆసియాలోని భారత్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం 50 శాతం సుంకం విధించారు. అయినా కూడా రైతుల కోసం భరిస్తామని ప్రధాని మోడీ అన్నారు. తమకు అన్నదాతలే ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. అయితే రష్యాను కంట్రోల్‌లోకి తెచ్చేందుకే భారత్‌పై భారీగా సుంకాలు విధించినట్లు వైట్‌హౌస్ క్లారిటీ ఇచ్చింది.