Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఆదివాసీ, గిరిజన హక్కులకు తూట్లు

ఆదివాసీ, గిరిజన హక్కులకు తూట్లు

- Advertisement -

– వారిని అడవికి దూరం చేసే కుట్ర
– అటవీ సంపదను ఆదానీ,
– అంబానీలకు దోచిపెడుతున్న కేంద్రం :
– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– మంతన్‌గౌరెల్లిలో ప్రపంచ ఆదివాసీ, గిరిజన హక్కుల దినోత్సవం
నవతెలంగాణ-యాచారం
: ఆదివాసీ, గిరిజనుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లిలో శనివారం ప్రపంచ ఆదివాసీ, గిరిజన హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందుగా ప్రపంచ ఆదివాసీ, గిరిజనుల హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఆదివాసీ, గిరిజనుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. దీనిపై 2022లోనే ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తుచేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదివాసీ, గిరిజన అటవీ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. వారంతా పేదరికంలోకి నెట్టబడ్డారని, వారి జీవన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలో ఆదివాసీ, గిరిజనులకు కల్పించిన హక్కులను అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. దశాబ్దాలుగా అటవీ ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను, అందులో ఉన్న ఖనిజ సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లు గడిచినా గిరిజనుల సంక్షేమం, జీవన విధానంలో ఆశించిన ఫలితాలు రాలేదని తెలిపారు. నేటికీ గిరిజన తండాలు, గూడెంలలో కరెంటు, పక్కా గృహాలు, తాగునీటి సౌకర్యం లేవన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆదివాసీ, గిరిజన హక్కుల అమలుకు తమ పార్టీ పోరాడుతోందన్నారు. వెంటనే ఆదివాసీల అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కంట్రోల్‌ కమిటీ చైర్మెన్‌ డిజి.నరసింహారావు, పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, నాయకులు ఎస్‌.చందునాయక్‌, కె.తావునాయక్‌, మౌనిక, కందుల శ్రీరాములు, కె.కుమార్‌, జంగయ్య, భాస్కర్‌, రవి, గోపాల్‌ పాల్గొన్నారు.
జాన్‌వెస్లీకి రాఖీ కట్టిన ఐద్వా నాయకురాలు యాచారం మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి గ్రామంలో పర్యటించిన జాన్‌వెస్లీకి ఐద్వా నాయకులు మౌనిక రాఖీ కట్టారు. డిజి.నరసింహారావు, పగడాల యాదయ్య, ఆలంపల్లి నరసింహకు రాఖీ కట్టారు. వారు ఆమెకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img