నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ఐఆర్ పేరుతో బీహార్‌లో సమగ్ర ఓటర్ జాబితా సవరణను ఈసీ చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ప్రక్రియపై బీహార్‌లో ఆందోళనలు మిన్నంటాయి. ఎస్ఐఆర్ పేరుతో అన్యాయంగా బడుగు బలహీన వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును హరిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇండియా బ్లాక్ కూటమి పార్టీలు పిటిషన్లు కూడా వేశాయి. అదే విధంగా ఎస్ఐఆర్ పేరుతో ఈసీ చేస్తున్న ఓట్ల చోరీ ఉదంతాన్ని ప్రజలకు తెలియజేయడానికి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను బీహార్ రాష్ట్రంలో కొనసాగిస్తున్నా విషయం తెలిసిందే.
ఈ అంశంపై తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ తరహలో ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ తమిళనాడులో జరగనియమని, సమగ్ర ఓటర్ జాబిత సవరణకు వీలులేదని చెప్పారు. బీహార్ ఓటర్ జాబితా సవరణ పేరుతో గల్లంతైన ఓట్ల చోరీ ఉదంతంపై తమ రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తామని చైన్నైలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు.