కల్తీ కల్లు ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. డ్రగ్స్‌ను అణచివేస్తామని చెప్తున్న ప్రభుత్వం కల్తీ కల్లుపై కఠిన చర్యలు తీసు కోవాలని కోరారు. కల్తీకల్లు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకో వాలని చెప్పారు. బసవతారకం నగర్‌లో 40 ఏండ్లుగా నివాసం ఉంటున్న పేదల ఇండ్లను కూల్చేస్తున్నారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇక్కడ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. కార్పొరేట్లకు భూములు కట్టబెట్టే జీవో 49 రద్దు చేయాలనీ, 8వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు చదివే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ఉన్న రూ.154 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వాలనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం ఉన్నచోట ఒంటరిగా పోటీ చేస్తామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మిగతా విషయాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, టి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కల్తీకల్లును అరికట్టాలి : జాన్‌వెస్లీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES