Wednesday, November 19, 2025
E-PAPER
Homeజాతీయంప్ర‌తికూల వాతావ‌ర‌ణం..విమానాలు దారి మ‌ళ్లీంపు

ప్ర‌తికూల వాతావ‌ర‌ణం..విమానాలు దారి మ‌ళ్లీంపు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: శ్రీలంకలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా బుధవారం శ్రీలంకకు వెళ్లాల్సిన రెండు విమానాలను కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. దమ్మామ్-కొలంబో విమానం, తిరువనంతపురంకు వెళ్లాల్సిన టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం ఉదయం విమానాశ్రయంలో సురక్షితంగా దిగాయి. మళ్లించిన ఈ విమానాలు శ్రీలంకలో వాతావరణం మెరుగుపడిన తర్వాత వాటి గమ్యస్థానాలకు బయలుదేరుతాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. బంగాళాఖాతం, దాని ఆనుకుని ఉన్న శ్రీలంకలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీలంక, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో తిరువనంతపురం విమానాశ్రయంలోని రెయిన్ గేజ్ 43 మి.మీ వర్షపాతం నమోదైంది.

కాగా, ఉక్రెయిన్‌ పాశ్చాత్య మిత్రదేశాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే పోలాండ్‌ సరిహద్దుకు సమీపంలో పశ్చిమ ఉక్రెయిన్‌ లక్ష్యంగా రష్యా వైమానిక దాడులకు దిగిందని ఆరోపిస్తూ.. పోలాండ్‌ బుధవారం తెల్లవారుజామున విమానాలను మోహరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -