- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: చిత్తూరు కలెక్టరేట్ ఎదుట అడ్వకేట్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం జరిగింది. భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో వీకోట మండలం మిట్టూరుకు చెందిన అడ్వకేట్ నందిని చిత్తూరు కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమె ప్రయత్నాన్ని అడ్డగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



