- Advertisement -
నవతెలంగాణ – తొగుట
రైతునేస్తం అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని ఏఈఓ నాగార్జున తెలిపారు. వ్యవసాయ సేవలకు గౌరవంగా మండలంలోని ఎల్లారెడ్డిపేట ఏఈఓ నాగార్జునకు విశిష్ట గుర్తింపు లభించింది. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్టులో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా తమకు అవార్డు ప్రదానం చేశారని అన్నారు. ఎనిమిదేళ్ల రైతుల సేవలో అంకితభావం తో కృషి చేసినందుకు గుర్తింపు గౌరవం, దక్కిందని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



