No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeబీజినెస్AESL 16 ఏళ్ల ఆంథేవిజయయాత్రను జరుపుకుంటూ ఆంథే 2025ను ప్రారంభించింది

AESL 16 ఏళ్ల ఆంథేవిజయయాత్రను జరుపుకుంటూ ఆంథే 2025ను ప్రారంభించింది

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : విద్యార్థుల ఆశయాలను విజయాలుగా మారుస్తూ 16 విజయవంతమైన సంవత్సరాలను పూర్తి చేసుకున్న దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందిన టెస్ట్ ప్రిపరేటరీ సంస్థ ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), తన ప్రదాన కార్యక్రమంగా ఆంథే 2025 (ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్) ని గర్వంగా ప్రారంభిస్తోంది. భారత విద్యా క్యాలెండర్‌లో ప్రతిష్టాత్మకమైన వార్షిక ఈవెంట్‌లలో ఇది ఒకటి. ఇది 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సవాళ్లను అధిగమించి నిజమైన సమస్యల పరిష్కారకులుగా ఎదగడానికి ప్రేరణనిస్తుంది.

నాణ్యమైన విద్యను అందరికీ అందించే లక్ష్యంతో ఆంథే 2025లో ₹250 కోట్ల విలువైన 100% వరకు స్కాలర్‌షిప్‌లు — క్లాస్‌రూమ్, ఆకాశ్ డిజిటల్, ఇన్విక్టస్ కోర్సులకు — అలాగే ₹2.5 కోట్ల నగదు బహుమతులు ఇవ్వబడతాయి. ఇది వైద్యం లేదా ఇంజనీరింగ్‌ రంగాల్లో విజయవంతమైన కెరీర్‌ కలలు కన్న విద్యార్థులకు ఆ అవకాశాలను అందిస్తుంది. NEET, JEE, స్టేట్ CETs, NTSE, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షల కోసం ఆకాశ్ నిపుణుల బోధనతో ఉత్తమ శిక్షణ పొందే మార్గాన్ని ఈ పరీక్ష అందిస్తుంది.

ఆకాశ్ సంస్థ తన నిబద్ధతకు తోడు, ఇప్పుడు “ఇన్విక్టస్ ఎస్‌” పేరుతో ఒక ప్రత్యేక స్కాలర్‌షిప్ పరీక్షను ప్రారంభిస్తోంది. ఇది JEE అడ్వాన్స్‌డ్‌కు ప్రిపరేషన్ కోసం రూపొందించిన “ఆకాశ్ ఇన్విక్టస్” ప్రోగ్రామ్‌లో చేరేందుకు 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత మరియు స్కాలర్‌షిప్ పరీక్ష ఆగస్టు 24, ఆగస్టు 31, సెప్టెంబర్ 7, 2025 తేదీలలో నిర్వహించబడుతుంది. మూడు గంటల పరీక్ష (ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు) ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాల్లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫీజు ₹300గా నిర్ణయించబడింది. ఈ పరీక్షలో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులకు 100% వరకు స్కాలర్‌షిప్‌లు మరియు ఆకర్షణీయమైన నగదు బహుమతులు లభిస్తాయి. “ఆకాశ్ ఇన్విక్టస్” ప్రోగ్రామ్ ప్రత్యేకంగా డిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై, బెంగళూరు, లక్నో, మీరట్, ప్రయాగ్‌రాజ్, డెహ్రాడూన్, భోపాల్, ఇండోర్, అహ్మదాబాద్, చండీగఢ్, రోహతక్, హైదరాబాద్, నమక్కల్, కోయంబత్తూర్, భువనేశ్వర్, రాంచీ, త్రిచీ, విశాఖపట్నం, ముంబయి, కొల్కతా, దుర్గాపూర్ మరియు పాట్నా నగరాల్లో ఉన్న ప్రత్యేక ఇన్విక్టస్ సెంటర్లలో అందుబాటులో ఉంది.

ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) CEO మరియు MD శ్రీ దీపక్ మెహ్రోత్రా మాట్లాడుతూ, “ఆంథే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల కోసం ఒక అవకాశాల చిహ్నంగా మారింది. గత 16 సంవత్సరాలుగా, మేము ప్రతిభావంతులైన విద్యార్థులు వారి ఆర్థిక స్థితి లేదా స్థలానికి సంబంధం లేకుండా తమ కలలను సాధించేందుకు సహాయం చేస్తున్నాము. ఆకాశ్ లో మేము ప్రతి విద్యార్థిలోనూ సమస్యలను పరిష్కరించగల, విమర్శనాత్మకంగా ఆలోచించగల సామర్థ్యం ఉందని నమ్ముతాము. ఆంథే 2025 ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ, అర్హులైన విద్యార్థులకు అవసరమైన వనరులు, సహాయం మరియు ప్రేరణను అందిస్తోంది. మా విస్తృత నెట్‌వర్క్ మరియు హైబ్రిడ్ లెర్నింగ్ పద్ధతుల ద్వారా, మేము నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నాము, ఫలితాలపై దృష్టి పెట్టుతున్నాము.

ఈ సంవత్సరంనుంచి, మేము ‘ఇన్‌విక్టస్ ఏస్ టెస్ట్’ ను ప్రారంభిస్తున్నాము, ఇది ప్రతిష్టాత్మకమైన ఆకాశ్ ఇన్‌విక్టస్ కోర్సులో స్కాలర్‌షిప్ మరియు అడ్మిషన్ కోసం నిర్వహించబడుతుంది. ఇది విద్యార్థుల మౌలిక కాన్సెప్ట్‌లపై ఉన్న అవగాహనను మరియు పోటీ పరీక్షల కోసం వారి సిద్ధతను అంచనా వేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.”

ఆంథే లో భాగంగా చాలా మంది టాపర్స్ పెరిగారు. 2025లో ఈ పరీక్షను 10 లక్షలకు పైగా విద్యార్థులు రాశారు, ఇది దేశంలోనే అతిపెద్ద స్కాలర్‌షిప్ పరీక్షలలో ఒకటిగా మారింది. AESLలో ఉన్న ప్రస్తుత టాపర్‌లు చాలామంది ఆంథే నుంచే తమ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా, ఈ ఏడాది NEET టాప్ 100లో 22 మంది మరియు JEE అడ్వాన్స్‌డ్ 2025 టాప్ 100లో 10 మంది ఆంథే ద్వారా మొదలుపెట్టారు.

ఆంథే 2025 పరీక్షను ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ విధానాల్లో నిర్వహించనున్నారు, తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు సౌలభ్యం కలిగించబడుతుంది. ఆన్‌లైన్ పరీక్షను అక్టోబర్ 4 నుండి 12, 2025 వరకు నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు తమకు అనుకూలంగా ఒక గంట స్లాట్ ఎంచుకొని పరీక్ష రాయవచ్చు. ఆఫ్‌లైన్ పరీక్షను అక్టోబర్ 5 మరియు 12 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష 26 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 415కిపైగా ఆకాష్ సెంటర్లలో జరుగుతుంది.

ఆంథే 2025 కు నమోదు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు https://anthe.aakash.ac.in/home వెబ్‌సైట్‌లో ఆన్లైన్‌లో నమోదు చేసుకోవచ్చు లేదా దగ్గరిలోని ఆకాష్ సెంటర్‌కి వెళ్లవచ్చు. పరీక్ష రుసుము ₹300/- (ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటికీ ఒకటే). ముందుగా దరఖాస్తు చేసిన వారికి 50% రాయితీ లభిస్తుంది. ఆన్‌లైన్ పరీక్షకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ పరీక్ష తేదీకి మూడురోజుల ముందు కాగా, ఆఫ్‌లైన్ పరీక్షకు ఏడు రోజులు ముందు దరఖాస్తు సమర్పించాలి. అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి ఐదు రోజుల ముందు జారీ చేస్తారు.

ఆంథే 2025 ఫలితాలను దశల వారీగా ప్రకటించనున్నారు. 10వ తరగతి ఫలితాలు అక్టోబర్ 24న, 7వ తరగతి నుండి 9వ తరగతి వరకు అక్టోబర్ 29న, 5వ మరియు 6వ తరగతుల ఫలితాలు నవంబర్ 1న విడుదల అవుతాయి. 11వ మరియు 12వ తరగతుల ఫలితాలు నవంబర్ 4న విడుదల చేస్తారు. అన్ని ఫలితాలు ఆంథే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

ఆంథే అనేది ఒక గంట వ్యవధి ఉన్న పరీక్షగా ఉంటుంది, ఇందులో విద్యార్థుల తరగతి మరియు వారి అభిరుచులకు అనుగుణంగా 40 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు, ఈ ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ మరియు మెంటల్ అబిలిటీ వంటి సబ్జెక్ట్‌లను ఆధారంగా ఉంటాయి. 10వ తరగతి విద్యార్థుల్లో మెడికల్ చదువులు ఆశించే వారికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మరియు మెంటల్ అబిలిటీ మీద ప్రశ్నలు ఉంటాయి; ఇంజినీరింగ్ అభిలాషలు ఉన్న వారికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మరియు మెంటల్ అబిలిటీ మీద ప్రశ్నలు ఉంటాయి. అదే విధంగా, 11వ మరియు 12వ తరగతుల NEET లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థుల కోసం ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూలాజీ మీద ఉంటాయి; ఇంజినీరింగ్ కోరుకునే విద్యార్థుల కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ మీద ప్రశ్నలు ఉంటాయి.

ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL) తన రెండు శక్తివంతమైన కార్యక్రమాలతో టెస్ట్ ప్రిపరేషన్‌కు నూతన దిశను ఇస్తోంది: Aakash Digital 2.0 మరియు Aakash Invictus. Aakash Digital 2.0 అనేది ఒక ఏఐ ఆధారిత, సమగ్ర ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్, ఇది NEET, JEE మరియు ఒలింపియాడ్స్‌ కోసం వ్యక్తిగతీకరించిన, ఖర్చు తక్కువగా ఉండే, ఫలితాలకేంద్రితమైన కోచింగ్‌ను అందిస్తుంది. దీని సరసన ఉండే Aakash Invictus అనేది దేశంలోని ఉత్తమ ఇంజినీరింగ్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన, ప్రీమియమ్ JEE అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్. చిన్న బ్యాచ్‌లు, టాప్ 500 JEE ఫ్యాకల్టీ, AI ఆధారిత విశ్లేషణలు, ప్రత్యేక కంటెంట్, మరియు కఠినమైన రివిజన్, టెస్టింగ్ మాడ్యూల్‌లతో Invictus, IIT టాపు ర్యాంకుల్నో లేదా గ్లోబల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లనో లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ఖచ్చితంగా తగిన “ఫిజిటల్” (ఫిజికల్+డిజిటల్) లెర్నింగ్‌ను అందిస్తుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad