నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ వేదికగా అఫ్గాన్ విదేశాంగ మంత్రి ముత్తాఖీ పాకిస్థాన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. భారత్‌పై ఉగ్రవాద దాడులు లేదా భారత వ్యతిరేక దాడులకు తమ భూభాగాన్ని ఎప్పటికీ అనుమతించబోమని స్పష్టం చేశారు. భారత్‌ను మిత్రదేశంగా భావిస్తామని.. పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజా సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అఫ్గానిస్థాన్, భారత్ రెండూ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, వీటిపై సంయుక్త పోరు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)ను పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత విదేశాంగ ఈ వ్యాఖ్యలు చేసింది.
అదే విధంగా బారుగ్రామ్ సైనిక స్థావరాల్లో విదేశీ సైన్యం జోక్యం సరికాదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి మాట్లాడారు. ఎట్టి పరిస్థితిలో ఆ ప్రాంతాన్ని ఇతర దేశాలకు అప్పగించేది లేదని స్పష్టం చేశారు. అఫ్గాన్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి, సార్వభౌమ దేశమని, ప్రతి దేశంతో మిత్ర సంబంధాన్ని ముంటామని ఢిల్లీ మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రి ముత్తాఖీ పేర్కొన్నారు.