- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో గుల్బాదిన్ నబీ (63; 35 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో అలరించాడు. సెదిఖుల్లా అటల్ (29), రహ్మనుల్లా గుర్బాజ్ (27), దార్విస్ రసూలీ (20) ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 2, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసుకున్నారు.
- Advertisement -



