Wednesday, October 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు..

రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు..

- Advertisement -

జిల్లాకు 4655 పరికరాలకు రూ. కోటి 38 లక్షలు మంజూరు..
అర్హత గల రైతులు సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా వ్యవసాయ అధికారి 
నవతెలంగాణ – అచ్చంపేట
వ్యవసాయ రంగంలో ప్రతి ఏడాది యంత్ర పరికరాల ధరలు పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతంలోని చిన్న, సన్నకారు  పేదరిక రైతులు యంత్ర పరికరాలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపైన వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేసేవారు. గత దశాబ్ద కాలంగా పంపిణీ చేయడం లేదు. 2025 – 2026 ఆర్థిక సంవత్సరానికి స్మామ్ (సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మేకనైజషన్) పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాలు విడుదల చేసింది.

 నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండలాలకు సంబంధించి 4655 వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రూ.కోటి 38 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. 

వ్యవసాయ యంత్ర పరికరాలు : పవర్ విడర్ -15, బ్రష్ కట్టర్ -41,  పవర్ టిల్లర్ -25, మేజ్ షాల్లార్- 20, పవర్స్ ప్లేయర్ 54 సీడ్ కం ఫర్టిలైజర్ -36, బండి ఫార్మర్ 12, ఇలా వరిగడ్డి మోపుకట్ట యంత్రాలు, చేతి పంపులు, రోటోవేటర్ లు మొత్తం 4655 వ్యవసాయ యాంత్రిక పరికరాలు మంజూరయ్యాయి.

భూమి కలిగిన రైతులు పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు, నాలుగు ఫోటోలు, ట్రాక్టర్ కు సంబంధించిన ఆర్సి జిరాక్స్ జత చేసి స్థానిక వ్యవసాయ కార్యాలయంలో ఇవ్వవలసి ఉంటుంది. దరఖాస్తులను వ్యవసాయ అధికారులు ఆన్లైన్ చేస్తారు. లక్షలు విలువ కలిగిన పరికరాలకు డివిజన్ వ్యవసాయాధికారి పరిధిలో ఉంటుంది. లక్ష పైబడిన పరికరాలకు జిల్లా వ్యవసాయ అధికారి పరిధిలో ఉంటుంది.

ప్రచారం చేయడంలో అధికారుల నిర్లక్ష్యం 

సబ్సిడీపై వచ్చిన వ్యవసాయ యాంత్రిక పరికరాలపై రైతులకు అవగాహన కల్పించడంలో ప్రచారం చేయడంలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని గ్రామీణ ప్రాంత చిన్న సన్నకారు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాకు 4655 యంత్ర పరికరాలు మంజూరు అయితే.. ఇప్పటివరకు కేవలం 1006 మంది దరఖాస్తులు మాత్రమే చేసుకున్నారు. సబ్సిడీ యంత్రాలపైన చిన్న, సన్న కారు రైతులకు అధికారులు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునే విధంగా అధికారులు కృషి చేయవలసిన అవసరం ఉందని వివిధ గ్రామాల రైతులు భావిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతరులకు 40 శాతం సబ్సిడీ
ఈ పథకంలో భాగంగా వ్యవసాయ యాంత్రిక పరికరాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతరులకు 40 శాతం సబ్సిడీపై పరికరాలు పంపిణీ చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం,  కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు కేటాయించారు.

అర్హత గల రైతులు దరఖాస్తులు చేసుకోవాలి- యశ్వంత్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి: 50 శాతం సబ్సిడీ పై చిన్న కారు రైతులకు వ్యవసాయ మంత్రి పరికరాలు మంజూరయ్యాయి. జిల్లాకు రూ.కోటి 38 లక్షల రూపాయలు ఖర్చు చేసి  4655 వ్యవసాయ యాంత్రికరణ పరికరాలు మంజూరు అయ్యాయి. రైతులు మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -